For Money

Business News

17800పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. ఉదయం నుంచి సింగపూర్ నిఫ్టి దాదాపు 80 పాయింట్లక పైగా నష్టంతో ఉంది. నిఫ్టి కూడా కాస్సేపు నష్టాల్లో ఉన్నా… క్షణాల్లోనే గ్రీన్‌లోకి వచ్చింది. ప్రస్తుతం 17,832 పాయింట్ల వద్ద 16 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఏమాత్రం క్షీణించినా.. వెంటనే మద్దతు లభిస్తోంది. అయితే నిఫ్టి ట్రెండ్‌ స్పష్టం కావాలంటే 10 గంటల వరకు వెయిట్ చేయాలని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టిలో 32 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ స్థిరంగా ఉండగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.44 శాతం లాభంతో ఉంది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ కూడా 0.34 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో పెద్ద హెచ్చుతగ్గులు లేవు.దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 12 శాతం లాభంతో రూ. 22.70 వద్ద ట్రేడవుతోంది.