For Money

Business News

చాన్నాళ్ళకు పసిడి కళ

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండితో పాటు బులియన్‌ పెరగడంతో మన మార్కెట్‌లో కూడా రెండూ ఆకర్షణీయ లాభాలు గడించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు అంచనాల మేరకే ఉండటంతో .. ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్ళకు ఆసక్తి చూపారు. ఇదే సమయంలో డాలర్‌ కూడా పెరగడంతో మన మార్కెట్‌ బులియన్‌ పెరిగింది. మెటల్‌ అండ్‌ కమాడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో బంగారం పది గ్రాముల జూన్‌ కాంట్రాక్ట్‌ రూ. 680 పెరగ్గా, వెండి మే కాంట్రాక్ట్‌ రూ. 1528లు పెరిగింది. బంగారం ఇపుడు రూ. 52860 వద్ద ట్రేడవుతుండగా, వెండి రూ.68822 వద్ద ట్రేడవుతోంది.