For Money

Business News

బులియన్‌ జిగేల్‌

మొత్తం కమాడిటీస్‌ గ్రీన్‌లో ఉన్నాయి. కాపర్‌ నుంచి ఇనుము వరకు అన్నింటికి భారీ డిమాండ్‌ వస్తోంది. డాలర్‌ పెరిగితే తగ్గాల్సిన కమాడిటీ మార్కెట్‌… ఇపుడు జోరు మీద ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి సరఫరా తగ్గడంతో ఖనిజాల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బులియన్‌ ధరలు కూడా ఇవాళ పుంజుకున్నారు. ర్యాలీ తరవాత కొన్ని రోజుల నుంచి డల్‌గా ఉన్న బంగారం ఇవాళ అమెరికా మార్కెట్‌లో 1950 డాలర్లు దాటి 1964 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే సిల్వర్‌ కూడా పెరుగుతోంది. ఇక ఫ్యూచర్‌మార్కెట్‌లో తీసుకుంటే ఎంసీఎక్స్‌లోబంగారం ధర రూ. 52500 దాటింది. ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ ధర ఇవాళ ఉదయం రూ. 51800 ఉండగా, ఇవాళ ధరలు పెరగడంతో క్రితం ముగింపుతో పోలిస్తే రూ.749 పెరిగి రూ. 52519 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ. 1092 పెరిగి రూ.69,139కి చేరింది.