For Money

Business News

భారత్‌పై కక్ష కట్టినట్లుగా …

ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ భారీగా బలపడుతోంది. ఇవాళ ఒక్క రోజే ఒక శాతంపైగా పెరిగింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇలా పెరగడం అరుదు. పైగా గత కొన్ని రోజులుగా అప్‌ ట్రెండ్‌లోఉన్న డాలర్‌ ఇవాళ మరింత పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 98.98కి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇతర కరెన్సీలు బలహీనపడుతున్న కొద్దీ డాలర్‌ బలం పెరుగుతోంది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ కూడా ఏదో వంకతో పెరుగుతూనే ఉంది. మొన్న బ్యారెల్‌ ధర 120 డాలర్లకు పెరిగి… వెంటనే 110 డాలర్లకు పడింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రం కావడంతో క్రూడ్‌ ఇవాళ 5శాతం దాకా పెరిగి 115 డాలర్లకు చేరింది. సాధారణంగా డాలర్‌ పెరిగితే క్రూడ్‌ ధరలు తగ్గేవి. అలాగే డాలర్‌ తగ్గితే క్రూడ్‌ ధర పెరిగేది. ఈ కారణంగా భారత్‌ క్రూడ్‌ కొనుగోళ్ళు దాదాపు స్థిరంగా ఉండేవి. ఇపుడు డాలర్‌తో పాటు క్రూడ్‌ పోటా పోటీగా పెరుగుతుండటంతో భారత్‌ దిగుమతి బిల్లు భారీగా పెరగనుంది.ఇప్పటికే అనేక ఖనిజాల ధరలు పెరగడంతో పరిశ్రమలు లబోదిబో మంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే దాదాపు అన్ని వస్తువుల ధరలపై పరోక్ష ప్రభావం ఉంటుంది.