For Money

Business News

నూకల ఎగుమతులపై నిషేధం

నిన్న బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించిన కేంద్ర ప్రభుత్వం నూకల ఎగుమతిని నిషేధించింది. దేశీయంగా పెరుగుతున్న బియ్యం ధరలను కట్టడి చేసేందుకు వాటి ఎగుమతులపై సుంకం విధించింది.అయితే అనేక పరిశ్రమలకు ముడి పదార్థమైన నూకలకు డిమాండ్‌ పెరుగుతోంది. ధరలు కూడా. దీంతో వీటి ఎగుమతులను ఏకంగా నిషేధించింది. ఈ నిషేధం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎగుమతుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నవారు ఇవాళ్టి నుంచి సెప్టెంబర్‌ 15లోగా వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రంలో ముఖ్యంగా వరి పండించే రాష్ట్రాల నుంచి దిగుబడి బాగా తగ్గనుందని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. దీంతో బియ్యం ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.