For Money

Business News

భగ్గుమన్న ఆయిల్‌.. వాల్‌స్ట్రీట్‌ డౌన్‌

ఇరాన్‌లోని గ్యాస్‌ ట్యాంక్‌లపై ఇజ్రాయిల్‌ దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సౌదీ అరేబియా, కతర్‌, యూఏఈలోని ఆయిల్ క్షేత్రాలపై తాము దాడులు చేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. చమురు క్షేత్రాల సమీపంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా ఇరాన్‌ హెచ్చరించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 110 డాలర్లను తాకింది. క్రూడ్‌ ఏకంగా ఆరు శాతం పెరగడంతో వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ప్రారంభమైంది. ఇవాళ ఫెడరల్‌ రిజర్వ్‌ మీటింగ్‌ కూడా ఉన్నందున మార్కెట్‌ బలహీనంగా ట్రేడవుతోంది. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం పరుగులు పెట్టే అవకాశముంది. మరోవైపు ఇరాన్‌ నుంచి తమ దేశానికి గ్యాస్‌ సరఫరా ఆగిపోయిందని ఇరాక్‌ వెల్లడించింది. చూస్తుంటే గల్ఫ్‌లో పరిస్థితి రోజురోజు దారుణంగా మారుతోంది. ఫలితంగా చమురు, గ్యాస్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగే అవకాశముంది.