For Money

Business News

చుక్కలు చూపుతున్న క్రూడ్‌ ఆయిల్‌

కజకిస్తాన్‌లో ప్రజల ఆందోళనతో క్రూడ్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒపెక్‌ ప్లస్‌ కూటమిలో కజకిస్తాన్ ఓ ప్రధాన సరఫరాదారు. దేశీయగా చమురు ధరలు పెంచడంతో జనం తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. దేశ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసినా జనం తమ ఆందోళనను విరమించడం లేదు. ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దేశం రోజుకు 16 లక్షల బ్యారెళ్ళ చమురును సరఫరా చేస్తోంది. తాజా గొడవల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రెండు శాతంపైగా పెరిగాయి. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.5 డాలర్లకు చేరింది. WTI క్రూడ్‌ ధర రెండున్నర శాతంపైగా పెరిగింది.