For Money

Business News

చుక్కలు చూపుతున్న క్రూడ్‌

ఇటీవల 130 డాలర్లను టచ్‌ చేసి 100 డాలర్ల లోపుకు వెళ్ళిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు మళ్ళీ అదే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఆపేసేలా యూరోపియన్‌ దేశాలను ఒప్పందించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. నాటో ప్రత్యేక సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. మరోవైపు అమెరికా వంటి ధనిక దేశాల్లో ఆయిల్‌ డిమాండ్‌ పెరుగుతోంది. అమెరికా వారపు ఆయిల్ నిల్వల డేటా ఇవాళ వచ్చింది. నిపుణుల అంచనాలకంటే నిల్వలు భారీగా తగ్గడంతో… క్రూడ్‌ ధరలు దూసుకుపోతున్నాయి. ఆసియా దేశాలు వాడే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ. 121.30 డాలర్లకు చేరగా, WTI క్రూడ్‌ 134.36 డాలర్లకు చేరింది. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ విలువ పెరిగింది. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 98.66కు చేరింది. డాలర్‌తో పాటు బులియన్‌ కూడా అర శాతం పైగా పెరగడం విశేషం.