For Money

Business News

లాభాలు స్వీకరించండి

మార్కెట్‌ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గిన దరిమిలా … మున్ముందు అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ భారీగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చని ఈక్విటీ మార్కెట్లు భావిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయాయి. మన మార్కెట్లు కూడా ఇవాళ ఆకర్షణీయ లాభాలు గడించే అవకాశముంది. ఇప్పటికే పొజిషన్స్‌ తీసుకున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు… ఇవాళ 18350 నుంచి 18400 మధ్య లాభాలు స్వీకరించడం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఆ తరవాత పెరిగినా పట్టించుకోవద్దని అంటున్నారు.అయితే నిఫ్టి కొనాలనుకునేవారు మాత్రం ఆగాల్సి ఉంటుదని అన్నారు. సపోర్ట్ జోన్‌ మాత్రం 18050 లేదా 18100 అని అనూజ్‌ పేర్కొన్నారు. ఈ స్థాయికి ఇవాళ రాకపోవచ్చని… కాని ఆ స్థాయి కోసం వెయిట్‌ చేయడం మంచిదని అన్నారు.