For Money

Business News

18,250పైన నిఫ్టి

నిఫ్టి అనుకున్నట్లే ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18289 పాయింట్లను తాకి ఇపుడు 18268 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 240 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 843 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టి ఐటీ సూచీ భారీ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి బ్యాంక్‌ ఆల్‌ టైమ్‌ హై 42131 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్ సూచీలు కూడా ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన ఇండియన్‌ హోటల్‌ రూ.10 లాభపడింది. అలాగే అశోక్‌ లేల్యాండ్‌ షేర్‌ కూడా మూడు శాతం లాభపడింది. నిన్న భారీగా క్షీణించిన అరబిందో ఫార్మా షేర్‌ ఇపుడు రూ. 12 లాభంతో ట్రేడవుతోంది. ఇక సూచీల విషయంలో వస్తే నిఫ్టిలోని 50 షేర్లూ లాభాల్లో ఉన్నాయి. 3.33 శాతం లాభంతో ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది. టాప్‌5లో నాలుగు షేర్లు ఐటీ రంగానికి చెందినవే. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో జొమాటో షేర్‌ 8 శాతం పైగా లాభంతో ఉంది.