For Money

Business News

నాజల్‌ టీకా ధర రూ.800..

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసుకునే నాజల్‌ వ్యాక్సిన్‌ ధర డోసుకు రూ. 800 (పన్నులు అదనం)లుగా ఖరారు చేశారు. 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్‌ డోసుగా ఈ వ్యాక్సిన్‌ను వేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. త్వరలోనే మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. భారీNasa స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.320కే ఇవ్వనున్నట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. ‘ఇంకొవాక్‌’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.