For Money

Business News

బీఓబీ లాభంలో రెండింతల వృద్ధి

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.1,061 కోట్లతో పోల్చితే లాభం ఏకంగా రెండింతలు పెరిగింది. ఎన్‌పీఏలకు చేయాల్సిన కేటాయింపులు తగ్గడంతో పాటు నికర వడ్డీ మార్జిన్‌ పెరగటం కలిసివచ్చిందని బ్యాంక్‌ పేర్కొంది. ఈ కాలంలో నికర వడ్డీ మార్జిన్‌ 14.38 శాతం వృద్ధి చెంది రూ.8,552 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 8.48 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు కూడా 2.39 శాతం నుంచి 2.25 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఈ కాలంలో మొండి బకాయిలు రూ.3,694 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.