For Money

Business News

ఆ కంపెనీలో వారం వారం జీతం

దేశీయ బీ2బీ ఈ కామర్స్ సంస్థ ఇండియామార్ట్ భారత్‌లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. తమ ఉద్యోగులకు ఇకపై వారం వారం జీతం చెల్లిస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది. ‘‘ఉద్యోగులకు అనుగుణంగా ఉండే పని సంస్కృతిని నిర్మించడంతో పాటూ, వారి యోగక్షేమమే లక్ష్యంగా వారం వారం జీతాలు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ సంస్థ మాదే’’.. అంటూ ఇండియామార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా వారం వారం జీతాలు చెల్లించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక బాధలు తీరి, వారి ఉత్పాదకత పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది. విదేశాల్లో చాలాకాలంగా ఈ పద్ధతి అమల్లో ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, వంటి దేశాల్లోని సంస్థలు తమ ఉద్యోగులకు ఇలా వారానికోసారి వేతనం చెల్లిస్తుంటాయి.