For Money

Business News

మార్కెట్‌ అంచనాలను మించి…

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బాజజ్‌ ఆటో మార్కెట్‌ అంచనాలను మించి చక్కటి పనితీరు కనబర్చింది. ఈటీ నౌ ఛానల్‌ సర్వేలో పాల్గొన్న మార్కెట్‌ విశ్లేషకులు ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1069 కోట్ల నికర లాభం రూ. 7652 కోట్ల ఆదాయం ప్రకటిస్తుందని అంచనా వేశారు. అలాగే కంపెనీ మార్జిన్‌ 15.6 శాతం ఉంటుందని భావించారు. ఈ మూడు కీలక అంశాల్లో కంపెనీ వీరి అంచనాలను మించి ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీరూ. 8005 కోట్ల ఆదాయంపై రూ. 1173 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే మార్జిన్‌ కూడా 16.2 శాతం రావడంతో మార్కెట్‌ విశ్లేషకులను ఆశ్చర్చపర్చింది. ముడి పదార్థాల వ్యయాన్ని నియంత్రించడం,.. ధరలు పెంచడంతో పాటు డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్ల ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగడంతో కంపెనీ మంచి పనితీరు కనబర్చగలిగింది. సెమి కండక్టర్స్‌ కొరత కారణంగగా అమ్మకాలు దెబ్బతిన్నాయని కంపెనీ పేర్కొంది.