For Money

Business News

అమరరాజా …అమ్మండి

అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు ఎపుడూ ఈ తలనొప్పి ఉండేదే. సొంత కంపెనీలను భారీ వ్యాల్యూయేషన్స్‌కు కొనుగోలు చేయడం ఈ కంపెనీ రివాజు. ప్రభుత్వం నుంచి గ్రూప్‌ కంపెనీ భారీ ఎత్తున భూములు సేకరించి… ఆ కంపెనీని భారీ వ్యాల్యూయేషన్‌కు అమరరాజా కొనుగోలు చేయడం గతంలో చూసిందే. ఇపుడు కూడా గ్రూప్‌ కంపెనీ అయిన మంగళ్‌ ఇండస్ట్రీస్‌ను అమరరాజా టేకోవర్‌ చేస్తోంది. ఇది కూడా గ్రూప్‌ కంపెనీ. ప్లాస్టిక్‌ కంటైనర్లు, కవర్లు, చిన్న విడి భాగాలు, హ్యాండిల్స్‌, జార్లు మొదలైన ప్లాస్టిక్స్‌ కాంపొనెంట్లను మంగళ్‌ ఇండస్ట్రీస్‌ అమర రాజా బ్యాటరీస్‌కు అందిస్తోంది. విలీనం ప్రతిపాదన ప్రకారం మంగళం వాటాదారులకు ప్రతి 74 షేర్లకు 65 అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు పొందుతారు.ఈ లెక్కన 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు పొందుతారన్నమాట. అంటే మంగళం ఇండస్ట్రీస్‌ వ్యాల్యూయేషన్‌ రూ. 592 కోట్లుగా తేలింది. ఒక ప్లాస్టిక్‌ డివిజన్‌కు ఇంత వ్యాల్యూయేషన్‌ ఇవ్వాలా అన్న చర్చ మార్కెట్‌లో జరుగుతోంది. మంగళం విలీనం తరవాత అమరరాజా బ్యాటరీస్‌లో ప్రమోటర్ల వాటా 28.06 శాతం నుంచి 32.86 శాతానికి పెరగనుంది. ఈ విలీన ప్రతిపాదనకు మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించింది. ఈ షేర్‌ నిన్న 3.71 శాతం క్షీణించి రూ. 484.85 వద్ద ముగిసింది. యాక్సిస్‌ క్యాపిటల్‌ ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 450గా పేర్కొంది. అంటే అమ్మమని సలహా ఇస్తోందన్నమాట.