For Money

Business News

అవతార్‌ 2…కలెక్షన్ల సునామీ

భారతదేశంలో ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద హాలివుడ్‌ చిత్రాల అన్ని రికార్డులను అవతార్‌-2 బద్ధలు కొట్టింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం మేరకు ఈ సినిమా మొదటిరోజే రూ. 45 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించింది. చెన్నైలో అధిక థియేటర్లు లభించకున్నా సౌత్‌ ఇండియాలో అవతార్‌ -2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో హైదరాబాద్‌, బెంగళూరు పోటీ పడుతున్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్‌ సాధించినట్లు తెలుస్తోంది. ఆదివారం అడ్వాన్స్‌ బుకింగ్‌లో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 47 శాతం ఆక్యుపెన్సీతో రూ. 1.32 కోట్ల కలెక్షన్స్‌ను హైదరాబాద్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంటున్నారు. రూ. 93 లక్షలతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ముంబైతో సహా దేశంలో మరే సెంటర్‌లోనూ ఈస్థాయి అడ్వాన్స్‌ బుకింగ్‌ లేదని తెలుస్తోంది. ఇవాళ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఐమ్యాక్స్‌, 3డీ వర్షన్స్‌కు జనం పోటెత్తుతున్నారు. ఇతర సినిమాలు ఏవీ లేకపోవడం, పాజిటివ్‌ టాక్‌ రావడంతో అవతార్‌ 2 కలెక్షన్స్‌లో కొత్త రికార్డు సృష్టించే అవకాశముంది. మొత్తం కలెక్షన్స్‌ రూ. 600 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.