For Money

Business News

18300 దిగువన ముగిసిన నిఫ్టి

అమ్మినోడు అదృష్టవంతుడు. ఒకసారి కాదు.. రెండు సార్లు అమ్మే ఛాన్స్‌ వచ్చింది. పెరిగినపుడల్లా అమ్మినవారు ఆకర్షణీయ లాభాలు గడించారు ఇవాళ. సూచీలకన్నా ఇటీవల బాగా పెరిగిన షేర్లు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు అమ్మినవారికి ఇవాళ కాసుల వర్షమే. ప్రధానంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు అమ్మినవారు పండుగ చేసుకున్నారు. ఉదయం 18440ని తాకిన నిఫ్టి 11 గంటలకల్లా 18300 దిగువకు వచ్చేసింది. ఆల్గో ట్రేడింగ్‌ ఇక్కడితో అయిపోయింది. ఇక యూరప్‌ మార్కెట్‌పై ఆశలతో నిఫ్టిని పెంచారు. మళ్ళీ క్రితం ముగింపు స్థాయి వరకు తీసుకెళ్ళారు. కాని యూరో కూడా భారీ నష్టాలతో ప్రారంభమైంది. అంతే.. మన నిఫ్టి మళ్ళీ దిగువకు వెళ్ళడం ప్రారంభమైంది. క్లోజింగ్‌కు ముందు ఇవాళ్టి క్లోజింగ్‌18,255ని తాకింది. చివరల్లో 18269 వద్ద ముగిసింది. నిఫ్టి 0.7 శాతం నష్టపోగా.. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 1.65 శాతం క్షీణించింది. నిఫ్టి నెక్ట్స్‌ 1026 శాతం తగ్గింది. నిజానికి సూచీలకన్నా షేర్ల ధరలు బాగా పడ్డాయి. నిఫ్టి బ్యాంక్‌ మాత్రమే నిఫ్టి స్థాయి నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు ఇవాళ రెడ్‌లో ముగిశాయి. అదానీ గ్రేప్‌ షేర్లలో కాస్త ఒత్తిడి కన్పించింది. నిఫ్టిలో 45 షేర్లు రెడ్‌లో ముగిశాయంటే.. మార్కెట్‌లో ఎంత ఒత్తిడి ఉందో అర్థమౌతోంది.