For Money

Business News

నిఫ్టికి ఐటీ చావుదెబ్బ

నిన్న, ఇవాళ కూడా ఐటీ షేర్లు భారీగా క్షీణించాయి. దీని ప్రభావం నిఫ్టిపై స్పష్టంగా కన్పిస్తోంది. నిఫ్టి కీలక స్థాయిలను కోల్పోతుండటంతో మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిజానికి నిఫ్టి చాలా తక్కువగా క్షీణిస్తోంది… కాని షేర్లు మాత్రం భారీగా క్షీణిస్తున్నాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18300 దిగువకు నిఫ్టి క్షీణించింది. నిఫ్టి ఇపుడు 100 పాయింట్ల నష్టంతో 18313 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిన్నటి కనిష్ఠ స్థాయిని కూడా నిఫ్టి కోల్పోయింది.నిఫ్టిలో ఏకంగా 44 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. కీలక సూచీలన్నీ ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నాయి. వైండ్‌ ఫాల్ గెయిన్స్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో ఓఎన్‌జీసీ గ్రీన్‌లో ఉంది. చాలా షేర్లు లాభాల్లో ఉన్నా.. నామమాత్రంగానే ఉన్నాయి. బ్లాక్‌ డీల్ ఖారణంగా జీఎంఎం ఫౌల్డర్ షేర్‌ ఏకంగా 15 శాతం నష్టంతో ఉంది. ఐఆర్‌సీటీ షేర్‌ ఇవాళ మరో రూ.8.25 క్షీణించి.. సరిగ్గా ఓఎఫ్‌ఎస్‌ ధర వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వం రూ. 680లకు షేర్లను ఆఫర్‌ చేస్తుండగా, రూ. 678ని తాకిన షేర్‌ ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. రిలయన్స్‌ గ్రీన్‌లో ఉంది. మరి నిఫ్టికి 18300 ప్రాంతంలో మద్దతు లభిస్తుందేమో చూడాలి.