For Money

Business News

ఆర్‌టీఐ చట్టాన్ని చంపేస్తారా?

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులోని పలు ప్రొవిజన్స్‌పై ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. ఈ చట్టాన్ని తేచ్చే ముందు సంప్రదింపులు జరపాలన్న కనీస ప్రామాణికతలు కూడా పాటించకపోవడంపై కమల్‌ హాసన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించిన నమూనా ప్రతిని నవంబర్‌ 18న ప్రచురించిందని అన్నారు. ఇందులో సమాచార హక్కు చట్టంలో కొన్ని కీలక మార్పులు చేయాలని ప్రతిపాదించారని, ఇవి ఆర్టీఐ చట్టం మౌలిక ఉద్దేశాలకు భంగం కల్గించేలా ఉన్నాయని కమల్‌ హాసన్‌ ఆరోపించారు. ఆర్‌టీఐ చట్టం 2005లోని సెక్షన్‌ బి (1) (J)లో మార్పు చేయడం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రొవిజన్‌ ప్రకారం పార్లమెంటులో వెల్లడించే అంశాలన్నీ ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా కోరే వారికి ఇవ్వాల్సిందే. అంటే పబ్లిక్‌ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే. అయితే ఈ సెక్షన్‌ నుంచి మినహాయిస్తూ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులో ప్రతిపాదించారు. ఇలాంటి పలు ఇతర సవరణల పట్ల కమల్‌ హాసన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ డ్రాఫ్ట్‌ బిల్లుపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇవాళే చివరి రోజని… ప్రజలకు ఈ సవరణలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి తెలపాలని కమల్‌ హాసన్‌ కోరారు.