For Money

Business News

7 శాతం క్షీణించిన అరబిందో

మొన్న కంపెనీ డైరెక్టర్‌ అరెస్ట్‌… ఇపుడు కంపెనీ నిరాశాజనక ఫలితాల కారణంగా అరబిందో ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈఏడాది ఆరంభంలో రూ.742 ఉన్న అరబిందో షేర్‌ ఇవాళ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 457కు పడిపోయింది. ఇవాళ రూ. 470 వద్ద ఓపెన్‌ అయిన అరబిందో ఫార్మా… వెంటనే రూ. 457లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌ దాదాపు ఏడు శాతం క్షీణించింది. తరవాత కోలుకుని ఇపుడు 5 శాతం నష్టంతో రూ. 464.85 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ షేర్‌లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. గత శుక్రవారం ఈ షేర్‌లో డెలివరీ శాతం 24శాతం మాత్రమే. అంటే లావాదేవీలు డే ట్రేడింగ్‌లోనే జరుగుతున్నాయి. ఈ కౌంటర్‌లో డెలివరీకి ఆసక్తి చూపడం లేదు. అరబిందోతో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, జైడస్‌ లైఫ్‌, నాట్కో ఫార్మా, దివీస్‌ ల్యాబ్‌, ఆల్కెమ్‌ ల్యాబ్‌ షేర్లు కూడా అధిక నష్టాలతో ట్రేడవుతున్నాయి.