For Money

Business News

10 శాతం పెరిగిన ఎల్‌ఐసీ

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చడంతో ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ ఆకర్షణీయ ఫలితాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ దాదాపు 10 శాతం లాభపడింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 627 కాగా, ఇవాళ ఓపెనింగ్‌లో 684.90ని తాకింది. తరవాత స్వల్ప లాభాల స్వీకరణతో ఈ షేర్‌ రూ. 673 వద్ద రూ. 44 లాభంతో ట్రేడవుతోంది. ఇదే సమయంలో మార్కెట్‌ బలహీనంగా ఉంది. నిఫ్టి నష్టాల్లోఉంది. మార్కెట్‌ గనుక గ్రీన్‌లో వచ్చే పక్షంలోఎల్‌ఐసీ షేర్‌ ఇంకా పెరిగే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు.