For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18382 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు18,363 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో ఉంది. ఇతర సూచీలు కూడా దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. మార్కెట్‌ నష్టాల్లోకి జారుకున్నా… వెంటనే కోలుకుంది. బ్యాంక్‌ నిఫ్టిలో ఒత్తిడి కన్పిస్తోంది. మెటల్స్‌ కాస్త ఆసక్తి కన్పిస్తోంది. దివీస్‌ తరవాత అరబిందో కూడా నిరాశజనక ఫలితాలు ప్రకటించడంతో మొత్తం ఫార్మా సెక్టార్‌పై ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం కాస్త పటిష్ఠంగా కన్పిస్తోంది. హిందాల్కో మూడు శాతంపైగా లాభపడింది. ఎల్‌ఐసీ, పేటీఎం, వేదాంత నిఫ్టి నెక్ట్స్‌కు మద్దతుగా నిలిచాయి. మిడ్‌ క్యాప్‌లో ఫలితాలకు చాలా షేర్లు రియాక్ట్‌ అవుతున్నాయి. అరబిందో ఫార్మా, ఆస్ట్రాల్‌, జీ షేర్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంకు షేర్లలో పెద్ద మార్పులు లేవు. నిన్న భారీగా పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. అదే స్థాయిలో కొనసాగుతోంది. నిన్న మిడ్‌ క్యాప్‌ సూచీ భారీగా క్షీణించింది. ఇవాళ కూడా అదే పరిస్థితి కన్పిస్తోంది. సూచీలు స్థిరంగా ఉన్నా… అనేక షేర్లు నష్టాల్లో ఉన్నాయి.