బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఆస్తులు జప్తు
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద మారన్‌కు చెందిన రూ.293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు భారతీయ కంపెనీలైన సదరన్ అగ్రిఫ్యూరేన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎం డైమండ్ బీచ్ రీసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల రూపంలో ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ షేర్లను జప్తు చేసింది. 2005-06, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సింగపుర్లోని సంస్థల్లో రూ.293.91 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.