For Money

Business News

AIకి కళ్ళెం… నష్టాల్లో కోప్సి

భద్రతా కారాణాల రీత్యా పవర్‌ ఫుల్‌ ఏఐ టూల్స్‌ అభివృద్ధి చేసే అంశాన్ని వాయిదా వేయాలన్న ఆంథ్రోపిక్‌ ఈసీఓ దారియో స్టేట్‌మెంట్‌తో ఏఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి కోప్సీ సూచీ మూడు శాతంపై నష్టంతో నడుస్తోంది. అలాగే జపాన్‌ సూచీ కూడా ఒక శాతం నష్టపోయింది. ఆంథ్రోపిక్‌ ప్రకటన తరవాత ఏఐ రంగంలో పెట్టుబడుల ప్రవాహం తగ్గుతుందన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే ఏఐ షేర్లకు ఉన్న వ్యాల్యూయేషన్‌పై కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దాదాపు ప్రధాన సూచీలన్నీ ఒక శాతం దాకా లాభపడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. ఏఐ షేర్లపై ఆందోళనతో పాటు భారీ క్రూడ్‌ ధరలు ప్రభావం మార్కెట్‌పై చూపుతోంది.

Leave a Reply