For Money

Business News

నష్టాల్లో సింగపూర్‌ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ప్రధాన సూచీలు నామమాత్రపు నష్టాలతో క్లోజయ్యాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.28 శాతం, డౌజోన్స్‌ 0.14 శాతం, నాస్‌డాక్‌ 0.18 శాతం నష్టపోయాయి. అయితే రాత్రి క్రూడ్‌ భారీగా క్షీణించింది. మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రూడ్‌ 104 డాలర్ల నుంచి 100 డాలర్ల లోపునకు వచ్చేసింది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.5 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ సూచీ 2.57 శాతం నష్టపోయింది. తైవాన్‌ రెండు శాతం నష్టంతో ఉంది. ఇక చైనా మార్కెట్‌ నష్టాలు కూడా ఒకటిన్నర శాతంపైనే ఉన్నాయి. ఒక్క మార్కెట్‌ కూడా గ్రీన్‌లో లేదు. ఇక సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి నష్టాలతో ప్రారంభం కావడం ఖాయమని అనిపిస్తోంది.