For Money

Business News

ఆశీర్వాద్‌ పైప్స్‌ రూ.500 కోట్ల పెట్టుబడి

రూ. 500 కోట్లతో హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆశీర్వాద్‌ పైప్స్‌ (అలియాక్సిస్‌ గ్రూపు) ప్రకటించింది. దావోస్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులు తెలంగాణలోనే తయారుచేసి.. ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఫార్మా దిగ్గజం నోవార్టీస్‌ కంపెనీ సీఈవో నరసింహన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కొద్దిరోజుల్లోనే.. ప్రపంచంలోనే తమ కంపెనీకి రెండో అతి పెద్ద కార్యాలయంగా ఎదగడం పట్ల నరసింహన్‌ సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణలోని నైపుణ్యం కలిగిన మానవవనరుల వల్లనే తమ సంస్థ పెరుగుతున్నదని కొనియాడారు.
మంత్రి కేటీఆర్‌తో డెలాయిట్‌, హెచ్‌సీఎల్‌, ఎన్‌ఈపీ, ఎయిర్‌టెల్‌, భారత్‌ఫోర్జ్‌తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఫొటో: డెలాయిట్‌ సీఈఓతో మంత్రి కేటీఆర్‌