For Money

Business News

బిగ్‌ బుల్‌కు ఏప్రిల్‌ షాక్‌!

ఈనెలలో ఇంకా 13 రోజులే పూర్తయ్యాయి. బిగ్‌ బుల్‌ రాకేస్‌ ఝున్‌ఝున్‌వాలాకు పెద్ద షాక్‌ తగిలించింది. ఆయన వద్ద ఉన్న షేర్ల మార్కెట్‌ విలువ రూ. 1100 కోట్లు క్షీణించింది. ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా పేరున దాదాపు 35 కంపెనీల్లో ఒక శాతంపైగా వాటా ఉంది. బుధవారం వరకు ఆయన వద్ద ఉన్న షేర్‌ మార్కెట్‌ విలువ రూ. 32,667 కోట్లు తగ్గినట్లు Trendlyne పేర్కొంది. మార్చి నెలాఖరున ఈ షేర్‌ విలువ రూ. 33,754 కోట్లు. అంటే 9 ట్రేడింగ్‌ సెషన్స్‌లో కోల్పోయిన సంపద ఇది. భార్యా, భర్తలకు టైటాన్‌లో 5.1 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ షేర్లు ఈ 9 సెషన్స్‌లో 3 శాతం క్షీణించింది. ఇంకా వీరికి స్టార్ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌, టాటా మోటార్స్‌, క్రిసిల్‌ కంపెనీలల షేర్లలో భారీ పెట్టుబడులు ఉన్నాయి.