ఏపీలో జీఎస్టీ వసూళ్ళు సూపర్
ఆంధ్రప్రదేశ్లో మే నెల జీఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మే నెలలో ఏపీలో జీఎస్టీ పన్నుల వసూళ్లు రూ.3,047 కోట్లు కాగా, గత ఏడాది ఇదే నెలలో రూ.2,074 కోట్లు వసూలయ్యాయి. అంటే 47 శాతం వృద్ధి సాధించిందన్నమాట. జాతీయస్థాయిలో సగటు వృద్ధి రేటు 44 శాతం. ఇక తెలంగాణలో మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.3,982 కోట్లుగా తేలింది. గతేడాది ఇదే మాసంలో తెలంగాణలో రూ.2,984 కోట్లు వసూలయ్యాయి. ఈ లెక్కన తెలంగాణలో మే నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది కూడా తెలంగాణ పన్ను వసూళ్ళు తగ్గకుండా స్థిర వృద్ధి నమోదు చేస్తూ వచ్చింది. జనాభాలో ఏపీకన్నా చిన్నదైనా తెలంగాణలో జీఎస్టీ వసూళ్ళ మొత్తం అధికం. దీనికి కారణం హైదరాబాద్ ప్రమఖ వాణిజ్య కేంద్రంగా మారడం.