For Money

Business News

16 శాతం క్షీణించిన జీఎస్టీ వసూళ్ళు

మే నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ. 1.41 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్ళు 16 శాతం తగ్గాయి. ఏప్రిల్‌ నెలలో జీఎస్టీ వసూళ్ళు ఆల్‌ టైమ్‌ హై రూ. 1.68 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. మే నెలలో కూడా గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగాయని ఆర్థిక శాఖ పేర్కొంది. మేనెల జీఎస్టీ వసూళ్ళలో సెంట్రల్ జీఎస్టీ రూ. 25036 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ. 32001 కోట్లు. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ. 73345 కోట్లు కాగా, సెస్‌ రూ. 10502 కోట్లుగత ఏడాది అక్టోబర్ నుంచి జీఎస్టీ వసూళ్ళు రూ. 1.30 లక్షలకు పైనే ఉంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి రూ. 1.40 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా 11వ నెల కూడా జీఎస్టీ వసూళ్ళు రూ. లక్ష కోట్లకు పైనే ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.