పూర్తిగా అదానీ చేతికి గంగవరం!
గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు లేఖ రాసింది. ఈ మొత్తం లావాదేవీ నెలలో పూర్తవుతుందని తెలిపింది. పోర్టుకు అవసరమైన 1,800 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. తాజా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 10.4 శాతం వాటాతో పాటు 1,800 ఎకరాలు అదానీ పరం అయ్యాయి. ఈ కంపెనీ ఇందులో 58.1 శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబానికి, దుబాయ్‌కి చెందిన విండీలేక్సైడ్ అనే కంపెనీకి 31.5ు వాటాలు ఉన్నాయి. భూములు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం 10.4 శాతం వాటా తీసుకుంది. అదానీ గ్రూప్‌కు వాటా అమ్మే విషయం ఓ నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఆ కమిటీ నివేదిక బహిరంగ పర్చకుండానే అదానీకి అమ్మేసింది రాష్ట్ర ప్రభుత్వం.