ఏపీ రూ.3,000 కోట్ల అప్పు
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ. 1000 కోట్లు 20 ఏళ్ళ గడవు ఉన్న బాండ్ల ద్వారా.. మరో రూ.1000 కోట్లు 19 ఏళ్ళ గడువు ఉన్న బాండ్ల ద్వారా సమీకరించింది. ఈ బాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లోనే అత్యధిక వడ్డీ రూ. 7.78 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించింది. మరో రూ.1000 కోట్ల రుణం పదేళ్ళ గడువుతో తీసుకుంది. దీనిపై వడ్డీ 7.76 శాతం. ఏపీతో పాటు హర్యానా రూ.1500 కోట్లు, మహారాష్ట్ర రూ. 5000 కోట్లు, పంజాబ్ రూ.500 కోట్ల రుణం సమీకరించాయి.