For Money

Business News

ఈ ఏడాది చెత్త ఆఫర్‌… రెయిన్‌బో ఐపీఓ

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌ బో చిల్ట్రన్స్‌ మెడికేర్‌ (రెయిన్‌ బో హాస్పిటల్‌) షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. నిన్నటి దాకా గ్రే మార్కెట్‌లో ప్రీమియంతో ట్రేడైన ఈ షేర్‌ లిస్టింగ్‌ రోజున ఏకంగా 20శాతంపైగా క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్లు లబోదబో మన్నారు. ఈ ఏడాదిలో లిస్టయిన పరమ చెత్త లిస్టింగ్‌ ఇదే. ఇక్కో షేర్‌ను రూ. 542లకు అలాట్ చేశారు. ఇష్యూ కూడా భారీ ఎత్తున సబ్‌స్క్రయిబ్‌ అయింది. కాని లిస్టింగ్‌ రోజున దారుణంగా పడిపోయింది.ఓపెనింగ్‌లో రూ. 506 వద్ద ప్రారంభమై రూ. 517.90కి చేరింది. కాని అక్కడి నుంచి రోజంతా పడుతూనే ఉంది. ఒకదశలో రూ. 421.65కు పడినా.. క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని రూ. 450 వద్ద ముగిసింది. షేర్‌ ఇంత దారుణంగా లిస్ట్‌ కావడానికి కారణంగా మార్కెట్‌ పరిస్థితులు బాగా లేకపోవడమనేనని విశ్లేషకులు అంటున్నారు.