మరో రూ.2,655 కోట్ల రుణానికి అనుమతి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-2022 తొలి త్రైమాసికంలో పెట్టుబడి వ్యయానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన 11 రాష్ట్రాలకు మరిన్ని రుణాలు సమీకరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. బాండ్ మార్కెట్ నుంచి రూ. 15,721 కోట్లు అదనంగా రుణం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆయా రాష్ట్రాల జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి)లో 0.25శాతానికి సమానమని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 11 రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితిలో రూ. 2,655 కోట్లతో ఏపీ మొదటిస్థానంలోఉంది.
ఆంధ్రప్రదేశ్ రూ .2,655 కోట్లు
మధ్యప్రదేశ్ రూ .2,590 కోట్లు
రాజస్థాన్ రూ. 2,593 కోట్లు
కేరళ రూ. 2,255 కోట్లు
హర్యానా రూ. 2,015 కోట్లు
బీహార్ రూ .1,699 కోట్లు
ఛత్తీస్ గఢ్ రూ .895 కోట్లు
ఉత్తరాఖండ్, రూ. 654 కోట్లు
మణిపూర్ రూ .90 కోట్లు
మేఘాలయ రూ. 96 కోట్లు
నాగాలాండ్ రూ .89 కోట్లు