తెలంగాణలో అమరరాజా కొత్త ప్లాంట్?
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో మున్ముంద అత్యాధునిక బ్యాటరీలకు డిమాండ్ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీకి పీఎల్ఐ స్కీమ్ కోసం అమరరాజా పోటీ పడింది. కాని రిలయన్స్, ఓలా, రాజేష్ ఎక్స్పోర్ట్స్లు ఆ బిడ్డింగ్‌లో గెలిచాయి. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ ప్లాంట్లకు తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. అమరారాజా బ్యాటరీస్ కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున అత్యాధునిక బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ళలో కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ రంగంలో పెద్ద కంపెనీలు కూడా ప్రవేశించడంతో… పోటీ తీవ్రమౌతోంది. త్వరలోనే ప్లాంట్లను ఏర్పాటు చేయడమే గాక… పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. ఈ సమయంలో ఏపీలోనే ప్లాంట్లు విస్తరించి… అక్కడి ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవడం కంటే తెలంగాణకు వెళ్ళడమే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న అమరరాజా పొరుగునే తమిళనాడులోకి విస్తరించాలని భావించింది. అయితే అంతర్జాతీయ కంపెనీలన్నీ హైదరాబాద్‌లో తరలి వస్తున్న సమయంలో అక్కడే ప్లాంట్ పెట్టడం మంచిదని అమరరాజా భావిస్తోంది. దీని వల్ల మంచి టాలెంట్‌తో పాటు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అమర రాజా భావిస్తోంది.