మహబూబ్‌నగర్ వద్ద అమరరాజా ప్లాంట్
ఊహించినట్లే అమరరాజా బ్యాటరీస్ తన కొత్త లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్ప నుంది. దేశంలో అతి పెద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఇదే. దాదాపు రూ. 9500 కోట్లతో మహబూబ్ నగర్ వద్ద ఉన్న దివిటీపల్లె వద్ద ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, అమరరాజా బ్యాటరీస్ మధ్య ఇవాళ అవగాహన ఒప్పందం కుదరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అమరరాజా ప్లాంట్‌తో ఈవీ అండ్ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ (ఏసీసీ) తయారీకి తెలంగాణ అనుకూల ప్రాంతంగా మరోసారి నిరూపించిందని కేటీఆర్ అన్నారు. అమరరాజా కొత్త ప్లాంట్ వల్ల 4500 మందికి ఉపాధి కల్గుతుందని కేటీఆర్అన్నారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. 37 ఏళ్ళుగా అమరరాజా సేవలందిస్తోంది.
పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే 10 ఏళ్ళలో తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని జయదేవ్ స్పష్టం చేశారు.
Minister @KTRTRS speaking at MoU-signing ceremony for setting up @AmaraRaja_Group's Lithium-Ion Giga Factory in Telangana. https://t.co/n30Vx6CWnK
— KTR, Former Minister (@MinisterKTR) December 2, 2022