For Money

Business News

నష్టాల్లో నిఫ్టి… మెరిసిన మిడ్‌క్యాప్‌

మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు ప్రారంభానికి ముందు నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 18,639ని తాకింది. యూరో మార్కెట్ల నష్టాలు చాలా పరిమితంగా ఉండటంతో స్వల్పంగా కోలుకుని 18,696 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 116 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 31 షేర్లు నష్టాలతో ముగిశాయి. అపోలో హాస్పిటల్‌లో ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ ఆటో షేర్లు నిఫ్టిని బాగా దెబ్బతీశాయి. ఐషర్‌ మోటార్స్‌ మూడు శాతం, ఎం అండ్‌ ఎం, హీరో మోటో కార్ప్‌ షేర్లు రెండు శాతం నష్టంతో ముగిశాయి. అయి మిడ్‌, స్మాల్ క్యాప్‌ షేర్లు బాగా రాణించాయి. నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ముగిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌, అదానీ గ్రీన్స్‌, అదానీ టోటల్‌ ఇవాళ నష్టాలతో ముగిశాయి. అయితే ఈ నష్టాలను పేటీఎం, నైకా, జొమాటొ వంటి షేర్లు కవర్‌ చేయడంతో నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ముగిశాయి. పేటీఎం 7 శాతంపైగా పెరగ్గా, జొమాటొ, నైకా షేర్లు మూడు శాతంపైగా లాభపడ్డాయి. ఇక మిడ్‌ క్యాప్‌ నిఫ్టి అరశాతంపైగా లాభంతో ముగిసింది. ఆస్ట్రాల్‌ మళ్ళీ రూ.2000 దాటింది. ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ మూడు శాతం లాభపడింది. బ్యాంక్‌ షేర్లలో మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌లు ఇంకా రాణిస్తున్నాయి.