For Money

Business News

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

ద్రవ్యోల్బణ రేటు భయాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి కూడా ఇవాళ ఒకదశలో 300 పాయింట్ల వరకు పడి …17,303 స్థాయిని తాకింది. మిడ్ సెషన్‌ ముందు యూరో మార్కెట్‌పై ఆశలతో కాస్త కోలుకున్న నిఫ్టి… తరవాత మళ్ళీ మరింత పతనమైంది. దీనికి కారణం యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ట్రేడ్‌ కావడం. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.26 శాతం నష్టంతో ట్రేడ్‌ కావడంతో నిఫ్టిలో అమ్మకాలు అధికమయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతం వరకు నష్టాల్లో ఉండటంతో ఏదశలోనూ నిఫ్టికి మద్దతు లభించలేదు. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 260 పాయింట్ల నష్టంతో 17,345 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా నిఫ్టి స్థాయిలో నష్టపోవడం విశేషం. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 2.3 శాతం క్షీణించడం చూస్తుంటే… ప్రధాన షేర్లతోపాటు ఇతర కౌంటర్లలో కూడా భారీ అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది. నిఫ్టిలో ఐటీ కౌంటర్లు భారీ తగ్గాయి. ప్రభుత్వ రంగ సంస్థల అండతో నిఫ్టి నష్టాలు తగ్గాయని అనుకోవచ్చు. బ్యాంక్‌ నిఫ్టిలో కేవలం ఒక్క షేర్‌ గ్రీన్‌లో ముగిస్తే… ఎన్‌బీఎఫ్‌సీ సూచీలో మొత్తం అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి.