For Money

Business News

ఎయిర్‌టెల్‌ లాభం 164 శాతం జంప్‌

మార్చితో ముగిసిన నాలుగో, చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 759 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ. 2,008 కోట్లకు అంటే ఏ164 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా 22.3 శాతం పెరిగి రూ. 25,747 కోట్ల నుంచి రూ. 31,500 కోట్లకు చేరింది. మార్కెట్‌ విశ్లేషకులు కంపెనీ రూ. 1587 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. పూర్తి ఏడాది పనితీరు చూస్తే
భారతీ ఎయిర్ టెల్ 2021-22లో రూ. 1,16,547 కోట్లు ఆదాయం సాధించింది. అంతకుముందు ఏడాది ఆదాయం రూ. 1,00,616 కోట్లు. ఇక కంపెనీకి అత్యంత కీలకమైన ARPU (average revenue per user) మార్చి త్రైమాసికంలో రూ. 178కి చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ARPU రూ.145 ఉండేది. రిలయన్స్‌ జియో మార్చి త్రైమాసికంలో రూ. 167.6 ARPUను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ గల ఫుల్లీ పెయిడ్‌ షేర్‌పై రూ. 3 డివిడెండ్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. అదే పాక్షికంగా చెల్లించిన షేర్‌కు రూ. 0.75 డివిడెండ్‌ను కంపెనీ చెల్లించనుంది. ఒక్కో వినియోగదారుడు వాడిన మొబైల్‌ డేటా 28.7 శాతం పెరిగి 18.8జీబీ (నెలకు)కి చేరిందని కంపెనీ వెల్లడించింది.