ఎయిర్‌టెల్ రూ.21,000 కోట్ల రైట్స్ ఇష్యూ
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ షేర్ ముఖవిలువ రూ.5. ఇన్వెస్టర్ల దగ్గరున్న ప్రతి 14 షేర్లకు ఒక షేర్‌ను రైట్స్ కింద ఆఫర్ చేస్తారు. రూ.530 ప్రీమియంతో షేర్లను జారీ చేస్తారు. అంటే షేర్ ఆఫర్ ధర రూ. 535 అవుతుందన్నమాట. బీఎస్‌ఈలో గత శుక్రవారం ఎయిర్‌టెల్ షేరు ఈ రూ.593.95 వద్ద క్లోజైంది. రైట్స్ ఇష్యూ షేర్ల జారీకి కంపెనీ రికార్డు రోజును త్వరలో ఖరారు చేస్తుంది. దరఖాస్తు సమయంలో 25 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాన్ని కంపెనీ నిర్ణయించే గడువులోగా రెండు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 55.8 శాతం వాటా ఉండగా, ప్రజలకు 44.09 శాతం వాటా ఉంది.