For Money

Business News

ఐటీ రిటర్న్ ఫైలింగ్ గడువు మళ్ళీపెంపు..?

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు తేదీని మరోమారు పొడిగించనన్నట్లు వినవస్తోంది. కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకుండా, సెప్టెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని ఇటీవల ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో, గడువు పొడిగించే అవకాశమున్నట్లు వినవస్తోంది. ఐటీ రిటర్న్‌ల దాఖలుకు గడువును పొడిగించే విషయమై మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఓ ప్రకటన రావొచ్చునని సమాచారం.