For Money

Business News

ఏవియేషన్‌కు భారీ నష్టాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఏవియేషన్‌ రంగానికి రూ. 25,000 నుంచి రూ. 26,000 కోట్ల నికర నష్టాన్ని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా వెల్లడించింది. విమాన ఇంధన ధరలు పెరగడం, కొవిడ్‌తో సర్వీసుల తగ్గింపు, ఛార్జీలు పెంచకుండా పరిమితి విధించడం వంటి అంశాల కారణంగా నష్టాలు తప్పవని పేర్కొంది. విమాన ప్రయాణీకుల ట్రాఫిక్‌ గణనీయంగా పెరుగుతున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ. 14,000-16,000 కోట్లకు తగ్గవచ్చని పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరానికల్లా పరిశ్రమ కొవిడ్‌ ముందస్తు స్థాయికి చేరుకోవచ్చని ఇక్రా అంటోంది.