For Money

Business News

అదానీ చేతికి గుజరాత్ అంబుజా?

మరికొన్ని రోజుల్లో దేశంలో నంబర్‌ వన్‌ సిమెంట్‌ తయారీదారుగా అదానీ గ్రూప్‌ మారనుంది. గుజరాత్‌ అంబుజా టేకోవర్‌కు అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌తో పాటు ఇతర కంపెనీల బిడ్‌లను హోలిసిమ్‌ మరో 24 గంటల్లో పరిశీలించి విజేతను ప్రకటించనుంది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తుంటే ఈ డీల్‌లో అదానీ గ్రూప్‌ విజేతగా నిలిచే అవకాశముంది. ఈ డీల్‌లో భాగంగా గుజరాత్ అంబుజాతో పాటు ఏసీసీ కూడా అదానీ చేతికి వస్తుంది. ఎందుకంటే ఏసీసీలో మెజారిటీ వాటాదారు గుజరాత్‌ అంబుజానే. భారత్‌ సిమెంట్‌ వ్యాపారం నుంచి వైదొలగాలని హోలిసిమ్‌ నిర్ణయించింది. ఈ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది. హోలిసిమ్‌ నుంచి ఈ వ్యాపారం కొనేందుకు అదానీ ఏకంగా 1000 కోట్ల డాలర్లు అంటే రూ. 78000 కోట్లు సిద్ధం చేశారు. గుజరాత్‌ అంబుజాతో పాటు ఏసీసీ కూడా లిస్టెడ్‌ కంపెనీనే. గుజరాత్‌ అంబుజాలో 63.1శాతం వాటా హోలిసిమ్‌కు ఉంది. ఆ వాటాను అదానీ కొనుగోలు చేయనున్నారు. ఈ డీల్‌తో ఏసీసీ కూడా అదానీ చేతికి వస్తుంది. ఎందుకంటే ఏసీసీలో గుజరాత్‌ అంబుజాకు 54.53 శాతం వాటా ఉంది. ఈ రెండు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1.14 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ టేకోవర్‌ డీల్‌ కుదిరితే అదానీ గ్రూప్‌ ఓపన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది.