For Money

Business News

నిఫ్టిలోకి అదానీ ఎంటర్‌ప్రైజస్‌

నిఫ్టి 50 షేర్లలో మార్పు జరిగింది. ఇపుడు ఈ సూచీలో ఉన్న శ్రీ సిమెంట్‌ షేర్‌ను సూచీ నుంచి తొలగించి అదానీ ఎంటర్‌ప్రైజస్‌ను చేర్చుతున్నారు. దీంతో సూచీలో అదానీ గ్రూప్‌ షేర్లు రెండు అవుతాయి. ఇప్పటికే నిఫ్టి50లో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ షేర్‌ ఉంది.సవరించిన జాబితా ఈనెల 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. నిఫ్టి50 నుంచి తొలగించిన శ్రీసిమెంట్‌ షేర్‌తో పాటు మరికొన్ని షేర్లను నిఫ్టి నెక్ట్స్‌లోకి చేర్చారు. అంతే సంఖ్యలో కొన్ని షేర్లను తొలగించారు.

నిఫ్టి 50లో
శ్రీసిమెంట్‌ స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌

నిఫ్టి నెక్ట్స్‌లో
చేర్చిన షేర్లు…
అదానీ టోటల్‌
బీఈఎల్‌
హెచ్‌ఏఎల్‌
ఐఆర్‌సీటీసీ
ఎంఫసిస్‌
సంవర్ధన మదర్సన్‌
శ్రీ సిమెంట్‌

తొలగించిన షేర్లు
అదానీ ఎంటర్‌ప్రైజస్‌
జుబ్లియంట్‌ ఫుడ్‌
లుపిన్‌
మైండ్‌ట్రీ
పీఎన్‌బీ
సెయిల్‌
జైడస్‌ లైఫ్‌