For Money

Business News

బొగ్గు దిగుమతి: కాంట్రాక్టులన్నీ అదానీకే!

ఒకవైపు లోక్‌సభలో బొగ్గు కొరత లేదని లోక్‌సభకు చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిందిగా రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోంది. రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి కోసం వాడే బొగ్గులో పది శాతం కచ్చితంగా దిగుమతి చేసుకున్న బొగ్గు ఉండాల్సిందేనని హుకూం జారీ చేసింది. దీంతో బీజేపీ పాలిత, బీజేపీ అనుకూల రాష్ట్రాలు బొగ్గు దిగుమతి వ్యవహారాన్ని ఎన్‌టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాయి. దీంతో ఎన్‌టీపీసీ 2 కోట్ల టన్నులు బొగ్గు దిగుమతి కోసం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో 1.73 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి కాంట్రాక్ట్‌లు అదానీ గ్రూప్‌ బ్లూచిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు దక్కినట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఎన్‌టీసీపీ ఇప్పటికే 70 లక్షల టన్నుల బొగ్గును తన ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్నట్లు తతెలుస్తోంది. బొగ్గు ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీ కోల్‌ ఇండియా చరిత్రలో తొలిసారి గత జూన్‌లో బొగ్గు దిగుమతి టెండర్‌ను పిలిచింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచకుండా విదేశీ బొగ్గు దిగుమతి కోసం రాష్ట్రాలపై ఒత్తిడి తేవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.