నష్టాల్లో డౌ… లాభాల్లో నాస్డాక్
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీలో దాదాపు ఏమాత్రం మార్పు లేదు. నామ మాత్రపు లాభనష్టాల్లో కదలాడుతోంది. నాస్డాక్ 0.7 శాతం లాభాల్లోఉండగా, డౌ జోనస్ 0.7 శాతం నష్టాల్లో ఉంది. ఎకానమీ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది.అనేక కంపెనీల నిరాశజనక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. పైగా నిరుద్యగో భృతి కోసం వచ్చే క్లయిముల సంఖ్య పెరిగింది. అలాగే ఇవాళ డాలర్ దాదాపు ఒక శాతం క్షీణించింది. దీంతో ఆయిల్, బులియన్ ధరలు ఆటోమేటిగ్గా పెరిగాయి. బంగారం మళ్ళీ 1850 డాలర్ల దగ్గరకు వచ్చేసింది.