For Money

Business News

12% డౌన్‌… CLSA కొనమంటోంది

మణప్పురం ఫైనాన్స్‌ షేర్‌ 12 శాతం క్షీణించింది. ఇపుడు రూ. 92 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 104.55. ప్రస్తుతం ఈ షేర్‌ 52 వారాల కనిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతోంది. కంపెనీ షేర్ ఈ స్థాయిలో క్షీణించడానికి ప్రధాన కారణం.. నిన్న కంపెనీ వెల్లడించిన ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ. 1628 కోట్ల నుంచి రూ. 1488 కోట్లకు క్షీణించింది. అలాగే నికర లాభం ఏకంగా 40 శాతం క్షీణించి రూ. 468 ఓట్ల నుంచి రూ. 260 కోట్లకు క్షీణించింది. అయితే కంపెనీ మున్ముందు బాగా రాణిస్తుందని ప్రముఖ బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. బంగారంపై రుణాలు సెగ్మెంట్‌ ఇంకా మెరుగుపడలేదని.. అయితే ఇతర పెద్ద కంపెనీలకన్నా మైక్రోఫైనాన్స్‌ మణప్పురం బాగా రాణిస్తోందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ ఏడాది రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటీ (RoE) 14 శాతం ఉంటుందని పేర్కొంది. కంపెనీ షేర్‌ ఇపుడు రూ. 92 వద్ద ఉండగా, సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్ రూ. 120గా పేర్కొంది.