For Money

Business News

ఐటీసీ … స్టార్‌ షేర్‌

మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉన్నా ఒకే ఒక ఆశాకిరణం… ఐటీసీ షేర్‌. నిన్న మార్కెట్‌ అంచనాలకు మించి ఫలితలను ఐటీసీ ప్రకటించింది. ముఖ్యంగా నాన్ సిగరేట్‌ విభాగం కంపెనీ బాగా రాణిస్తోంది. నిన్న కంపెనీ రూ.6.25 డివిడెండ్‌ ప్రకటించింది. ఇది వరకే రూ. 5.25 డివిడెండ్‌ను చెల్లించింది. అంటే మొత్తం రూ. 11.50 ఇచ్చిందన్నమాట. డివిడెండ్‌ ప్రకటించిన ఏడాదిలో ఐటీ షేర్‌ సగటు ధర సుమారు రూ.200 ప్రాంతంలో ఉంది. అంటే ఏడాదికి 5.5 శాతం వరకు డివిడెండ్‌ వచ్చినట్లే. దీంతో ఐటీసీ ఆరంభంలో నష్టంలో ప్రారంభమైనా.. వెంటనే కోలుకుని ఇపుడు 4 శాతం లాభంతో ట్రేడవుతోంది. డివిడెండ్‌తో పాటు కనీసం ఏడాదికి పది శాతం షేర్‌ ధర పెరుగుదల ఆశించేవారికి ఐటీసీ మంచి షేరని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ షేర్‌ రూ.300 దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మోర్గాన్‌ స్టాన్లీ ఈ షేర్‌ను కొనుగోలు చేయమని సలహా ఇస్తోంది. షేర్‌ టార్గెట్‌ రూ. 293గా పేర్కొంది.