రెయిన్బో షేర్లకు భారీ నష్టాలు
ఇటీవల పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన హైదరాబాద్ కంపెనీ రెయిన్ బో హాస్పిటల్ షేర్ భారీ ఒత్తిడికి లోనవుతోంది. లిస్టింగ్ రోజే వంద రూపాయిలు క్షీణించి.. దరఖాస్తుదారులకు షాక్ ఇచ్చిన ఈ కంపెనీ షేర్.. తరవాత స్వల్పంగా కోలుకంది. రూ. 517 వద్ద లిస్టయిన ఈ షేర్ అదే రోజు రూ.421 వద్ద లిస్టయింది. తరవాత రూ. 475 ప్రాంతానికి వచ్చిన ఈ షేర్ ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. ఈ షేర్ ఏ కాస్త పెరిగినా ఇన్వెస్టర్లు బయటపడుతున్నారు. గత శుక్రవారం రూ. 465 నుంచి రూ. 456కు క్షీణించింది. ఇవాళ నిఫ్టి దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉన్నా.. రెయిన్ బో షేర్ రూ.20లకుపైగా క్షీణించి రూ.434కు పడిపోయింది. ఈ ఒక్క రోజూ గరిష్ఠస్థాయి నుంచి ఈ షేర్ రూ. 26 క్షీణించడం విశేషం. ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి రూ.13 దూరంలో ఉంది. పబ్లిక్ ఆఫర్‌కు సబ్స్క్రయిబ్కు చేసిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయాయి.