రెపో రేటు 0.4 శాతం పెంపు
ఆర్బీఐ షాక్ ఇచ్చింది. రెపో రేటును ఏకంగా 0.4 శాతం పెంచింది. ఈ రేటు వెంటనే అమల్లోకి వస్తుంది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్టి పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన ఎంపీసీ సమావేశం జరిగిందని, పరిస్థితిని సమీక్షించి రెపో రేటును పెంచాలని నిర్ణయించినట్లు గవర్నర్ చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొద్దిసేపటి క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. వచ్చేనెలలో పరపతి విధానంలో వడ్డీ రేట్లను పెంచుతారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుని రెపో రేటును పెంచుతున్నట్లు గవర్నర్ తెలిపారు.