For Money

Business News

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఇవాళ రాత్రికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచునున్న నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా క్షీణించింది. 2 గంటలకు ఆర్బీఐ ప్రకటన ఉంటుందని వార్తలు రావడంతో… మార్కెట్‌ బలహీనపడింది. అయితే పావు శాతం రెపో రేటు పెంచుతారని మార్కెట్‌ భావించింది. అయితే మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా 0.4 శాతం రెపో రేటును పెంచడంతో ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దెబ్బతిన్నాయి. ఉదయం 17132 పాయింట్లు ఉన్న నిఫ్టి 16751 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టి 380 పాయింట్ల దాకా పతనమైంది. మరోవైపు సెన్సెక్స్ 1000 పాయింట్లు క్షీణించింది. బ్యాంకుల్లో బంధన్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మూడు శాతం వరకు నష్టపోయాయి.